మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Gopijana Vallabha Ashtakam 2 – శ్రీ గోపీజనవల్లభాష్టకం


సరోజనేత్రాయ కృపాయుతాయ
మందారమాలాపరిభూషితాయ |
ఉదారహాసాయ లసన్ముఖాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 1 ||

ఆనందనందాదికదాయకాయ
బకీబకప్రాణవినాశకాయ |
మృగేంద్రహస్తాగ్రజభూషణాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 2 ||

గోపాలలీలాకృతకౌతుకాయ
గోపాలకాజీవనజీవనాయ |
భక్తైకగమ్యాయ నవప్రియాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 3 ||

మన్థానభాండాఖిలభంజనాయ
హైయ్యంగవీనాశనరంజనాయ |
గోస్వాదుదుగ్ధామృతపోషితాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 4 ||

కళిందజాకూలకుతూహలాయ
కిశోరరూపాయ మనోహరాయ |
పిశంగవస్త్రాయ నరోత్తమాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 5 ||

ధారాధరాభాయ ధరాధరాయ
శృంగారహారావళిశోభితాయ |
సమస్తగర్గోక్తిసులక్షణాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 6 ||

ఇభేంద్రకుంభస్థలఖండనాయ
విదేశబృందావనమండనాయ |
హంసాయ కంసాసురమర్దనాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 7 ||

శ్రీదేవకీసూనువిమోక్షణాయ
క్షత్తోద్ధవాక్రూరవరప్రదాయ |
గదాసిశంఖాబ్జచతుర్భుజాయ
నమోఽస్తు గోపీజనవల్లభాయ || 8 ||

ఇతి శ్రీహరిదాస కృత శ్రీ గోపీజనవల్లభాష్టకమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.